Draupadi Murmu: రాష్ట్రపతితో సీడీఎస్, త్రివిధ దళాధిపతుల భేటీ

భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu )తో చీఫ్ ఆఫ్ డిపెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ (Anil Chauhan )తో పాటు త్రివిధ దళాదిపతులు భేటీ అయ్యారు. పహల్గాం (Pahalgam) ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ బలగాలు ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ను విజయవంతంగా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలను అధికారులు రాష్ట్రపతికి వివరించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా త్రివిధ దళాలు పోరాడిన తీరును ఈ సందర్భంగా రాష్ట్రపతి అభినందించారు.