చైనాకు భారత్ భారీ షాక్ …
భారత్‌ను దెబ్బ తీయాలని నానా ప్రయత్నాలు చేస్తున్న చైనాకు భారీ షాక్ తగలనుంది. ప్రస్తుత దీపావళి సీజన్లో చైనా వస్తువులను భారత వ్యాపారులు నిషేదించడంతో డ్రాగన్ దేశ ఎగుమతిదారులు కొన్ని వేల కోట్లు నష్టపోనున్నారు. ఈ దీపావళికి చైనా సరకులను బాయ్ కాట్ చేయాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) వ్యాపారులకు పిలుపునిచ్చింది. దీంతో చైనాకు సుమారు 50 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దేశంలోని ప్రధాన నగరాల్లోని వినియోగదారులు చైనీస్ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదని దీని ప్రభావంతో భారతీయ వస్తువులకు డిమాండ్‌ను పెరుగుతున్నట్లు సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 ముఖ్యమైన నగరాల్లో నిర్వహించిన సర్వేలో ఇప్పటివరకు దీపావళి వస్తువులు, బాణసంచా లేదా ఇతర వస్తువుల కోసం చైనా ఎగుమతిదారులకు భారతీయ వ్యాపారులు లేదా దిగుమతిదారులు ఎటువంటి ఆర్డర్లు ఇవ్వలేదని తేలింది.






