Budget: ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్.. ఆర్థిక నిపుణులతో ప్రధాని భేటీ!

వచ్చే ఏడాది పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది. బడ్జెట్‌కు సంబంధించి అభిప్రాయాలు, సూచనలను స్వీకరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi )ఆర్థికవేత్తలు, నిపుణులతో సమావేశమయ్యారు. ఫిబ్రవరి 1న లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) 2025-26 బడ్జెట్‌ను పార్లమెంట్ (Parliament)లో ప్రవేశపెడుతారు. ఈ సమావేశంలో సీతారామన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ, నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం, ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్, సుర్జిత్ భల్లా, డీకే జోషి సహా ప్రముఖ ఆర్థికవేత్తలు సమావేశానికి హాజరయ్యారు.