ప్రపంచంలోనే మొదటిసారి.. చెన్నైలో

చెన్నైలోని అపోలో క్యాన్సర్ సెంటర్స్‌కు చెందిన వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. ప్రపంచంలోనే మొదటిసారిగా కనుబొమ్మ నుంచి కీహోల్ సర్జరీ చేసి మెదడు లోపల ఉన్న కణితిని విజయవంతంగా తొలగించారు. ఇటీవల ఓ మహిళ (44) ద్విచక్ర వాహన ప్రమాదంలో దవాఖానలో చేరారు. ఆమెకు పరీక్షలు చేస్తున్న సమయంలో మెదడు లోపల ఉండే సెరిబ్రల్ కార్టెక్స్‌లో కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. రక్త నాళాల మధ్యన, మనిషి మాటలు, కదలికలను నియంత్రించే ప్రాంతంలో కణతి ఉంది. దీంతో మెదడు కణజాలం, రక్తనాళాల నుంచి సాధారణ సర్జరీ చేస్తే బాధితురాలికి పక్షవాతం, స్ట్రోక్, మాట్లాడే శక్తి కోల్పోవడం వంటి సమస్యల ముప్పు ఉందని వైద్యులు భావించారు. పైగా ఈ శస్త్ర చికిత్స చేసేటప్పుడు పెషేంట్ మెలకువతో ఉండాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త రకమైన కనుబొమ్మ ద్వారా కీహోల్ సర్జరీ చేసి కణితిని తొలగించారు.