కాంగ్రెస్ కంటే 5 రెట్లు అధికంగా… బీజేపీకి

వరుసగా ఏడవ ఏడాది కూడా బీజేపీ దేశంలోని ఇతర రాజకీయ పార్టీలు అన్నింటి కన్నా అత్యధికంగా విరాళాలు పొందిందని తాజా నివేదిక ఒకటి తెలియచేస్తున్నది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో బీజేపీ సుమారు రూ.750 కోట్ల రూపాయలు విరాళాలు పొందింది. ఈ మొత్తాన్ని అనేక కంపెనీలు, వ్యక్తులు అందజేశారని బీజేపీ ఎలక్షన్ కమిషన్‍కి సమర్పించిన కంట్రిబూషన్ నివేదికలో తెలిపింది. కాంగ్రెస్ పార్టీ పొందిన విరాళాల కంటే 5 రెట్లు ఎక్కువ. జాతీయ కాంగ్రెస్ పార్టీ రూ.59 కోట్లు, టీఎంసీ రూ.8 కోట్లు, సిపిఎం రూ.19.6 కోట్లు, సీపీఐ రూ.1.9 కోట్లు ఇదే కాలంలో విరాళాలు పొందాయి.
బీజేపీ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్‍కి చెందిన జూపిటర్ కాపిటల్, ఐటిసి గ్రూప్, రియల్ ఎస్టేట్ కంపెనీలు, మేక్రో టెక్ డెవెలపర్స్ (ఇంతకు ముందు) లోథా డెవెలర్స్ బిజి ష్రైక్ కన్‍స్ట్రక్షన్ టెక్నాలజీ, ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ వంటివి బీజేపీకి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చిన వాటిలో కొన్ని సంస్థలు మాత్రమే. ఎలక్టొరల్ ట్రస్ట్ అనేది ఒక సెక్షన్ 25 కంపెనీ. ఇది కార్పొరేట్ కంపెనీల నుంచి విరాళాలు పొంది రాజకీయ పార్టీలకు పంపిణీ చేస్తుంది. రాజకీయ విరాళాలు అందించేటప్పుడు దాతల పేర్లను ఇది గోప్యంగా ఉంచుతుంది. భారతీయ ఎంటరప్రైజెస్, జిఎంఆర్ ఎయిర్ పోర్ట్ డెవెలపర్స్, డిఎల్‍ఎఫ్ లిమిటెడ్ వంటి సంస్థలు ప్రుడెంట్ ఎలక్టొరల్ ట్రస్ట్కి విరాళాలు ఇచ్చే ముఖ్యమైన దాతలు. జనకళ్యాణ్ ఎలక్టొరల్ ట్రస్ట్ జెఎస్ డబ్ల్యు గ్రూప్ కంపెనీల విరాళాలు పొందుతుంది.