Bihar: తొలిసారిగా బిహార్‌లో … ఆన్‌లైన్ ద్వారా ఓటు

ఎన్నికల ప్రక్రియలో ఎన్నో సంస్కరణలు తీసుకువస్తున్న ఎన్నికల సంఘం తాజాగా ఆన్‌లైన్ (Online) ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకావం కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ (Mobile app)ను అందుబాటులోకి తీసుకువచ్చింది. పైలట్ ప్రాజెక్టు (Pilot project)లో భాగంగా బిహార్ (Bihar)లో ఆరు మున్సిపల్ కౌన్సిళ్లకు జరిగిన ఎన్నికల్లో దీన్ని అమలు చేశారు. పోలింగ్ బూత్‌లకు చేరుకోలేని వయోవృద్ధులు, వికలాంగులు, గర్భిణీలు, వలస కార్మికులతో పాటు ఇతరుల కోసం ఈ సాంకేతికతను అందుబాటులోకి తెచ్చినట్లు బిహార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దీపక్ ప్రసాద్ (Deepak Prasad) వెల్లడిరచారు. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే రానున్న రోజుల్లో ప్రజాస్వామ్య ప్రక్రియలో మరో కీలక మైలురాయిగా నిలువనుంది.