ఎస్‍బీఐ మరో గుడ్‍న్యూస్… ఆన్‍లైన్‍లో

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‍బీఐ) తన ఖాతాదారులకు మరో గుడ్‍న్యూస్ అందించింది. ఇప్పటి నుంచి బ్రాంచ్‍ను ఆన్‍లైన్‍లో మార్చుకునే అవకాశం కల్పిస్తోంది. ఎస్‍బీఐ కస్టమర్లు ఎవరైనా తమ తమ ఖాతాలను మరొక శాఖకు బదిలీ చేయాలనుకుంటే ఇదే ఎంతగానే ఉపయోగపడుతుంది. దీని కోసం మీరు ఇకపై బ్యాంకు వెళ్లవలసిన అవసరం ఉండదు. ఇంట్లో నుంచే బ్రాంచ్‍ను సులభంగా మార్చుకోవచ్చు. కరోనా మహమ్మారి దృష్ట్యా ఎస్‍బీఐ ఈ మొత్తం పక్రియను ఆన్‍లైన్‍లోనే పూర్తి చేసుకునే సౌకర్యం కల్పించింది. ఆన్‍లైన్ కస్టమర్లు కాకుండా యోనో ఎస్‍బీఐ, యోనో లైట్ ద్వారా కూడా తమ బ్రాంచ్‍ను మార్చవచ్చు. కస్టమర్ మొబైల్ నంబర్ ఖాతాకు లింక్ చేసి ఉంటే ఈ పక్రియ పూర్తవుతుంది. ఎస్‍బిఐ అధికారిక వెబ్‍సైట్, ఆన్‍లైన్‍ఎస్‍బిఐ.కామ్‍లోకి లాగిన్ కావడం ద్వారా బ్రాంచ్‍ను మార్చుకోవచ్చు.