West Bengal: బెంగాల్ అల్లర్ల బాధితులను పరామర్శించిన గవర్నర్

వక్ఫ్ సవరణ చట్టం అమలుకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో నష్టపోయిన బాధితులను పశ్చిమ బెంగాల్ (West Bengal) గవర్నర్ సీవీ ఆనంద బోస్ స్వయంగా కలిసి ఓదార్చారు. ముర్షిదాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలను సందర్శించి, బాధితులకు మనోధైర్యాన్ని అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. బాధితులలో భద్రతా భావం లోపించిందని, దానిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని గవర్నర్ అన్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తానని ఆయన (West Bengal) హామీ ఇచ్చారు. ఈ ప్రాంత ప్రజల సమస్యలను నేరుగా తనకు తెలియజేయడానికి వీలుగా తన కార్యాలయం ఫోన్ నంబర్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు ఆయన ప్రకటించారు. “ఇక్కడ శాంతిని నెలకొల్పడం నా ప్రధాన బాధ్యత. రాష్ట్ర (West Bengal) ప్రభుత్వ పనితీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఏప్రిల్ 11న జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని నేను సూచిస్తాను” అని గవర్నర్ బోస్ అన్నారు. వక్ఫ్ సవరణ చట్టం అమలును వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 11న ముర్షిదాబాద్‌లోని సంసేర్‌గంజ్ ప్రాంతంలో తీవ్రమైన అల్లర్లు చెలరేగాయి. ఈ దురదృష్టకర సంఘటనలో అరబింద దాస్, చందన్ దాస్ అనే తండ్రీ కొడుకులు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన (West Bengal) బెంగాల్ గవర్నర్.. వారికి సానుభూతి తెలిపారు. ముర్షిదాబాద్ జిల్లాలోని ఇతర ప్రాంతాలలో కూడా వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా అల్లర్లు చోటుచేసుకున్నాయి. గవర్నర్ ఆ ప్రాంతాలను కూడా సందర్శించి, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.