వాట్సాప్ లో యాక్సిస్ సేవలు

యాక్సిస్ బ్యాంక్ వినియోగదారులు వాట్సాప్ చాట్ బాట్ ద్వారా విస్త•త సేవలు పొందవచ్చు. ఖాతాలో నిల్వ, క్రెడిట్ కార్డ్, బిల్లులు, డిపాజిట్స్, లోన్స్ వివరాలతోపాటు సమీపంలోని బ్యాంకు శాఖ, ఏటీఎం కేంద్రం ఎక్కడ ఉందో వంటి సమాచారం తెలుసుకోవచ్చు. కస్టమర్ల వాట్సాప్ సమాచారం పూర్తిగా భద్రంగా ఉంటుందని బ్యాంకు తెలిపింది. తన్లా ప్లాట్ ఫామ్‍కు చెందిన కారిక్స్ మొబైల్ ఈ వాట్సాప్ సాల్యూషన్స్ అందిస్తోంది.