Arvind kejriwals:కేజ్రీవాల్ కీలక ప్రకటన… తాము అధికారంలోకి వస్తే.. వారికి నెలకు రూ.18 వేలు

ఢల్లీి అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) ప్రజలను ఆకట్టుకునేందుకు కీలక హామీలు ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (kejriwals) కీలక ప్రకటన చేశారు. ఆలయాలు, గురుద్వారాల్లో పనిచేసే పూజారులు(Priests), గ్రంథీలకు కేజ్రీ వారాల జల్లు కురిపించారు. సమాజానికి వారు నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. దురదృష్టవశాత్తు వారి ఆర్థిక శ్రేయస్సు ఎవరు పట్టించుకోవడం లేదు. తాము అధికారంలోకి వస్తే వారికి నెలకు రూ.18 వేల గౌరవ వేతనం అందజేస్తామనిన ప్రకటించారు. ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ రేపటి నుంచే ప్రారంభం అవుతుందని కేజ్రీవాల్ వెల్లడిరచారు. హనుమాన్ ఆలయం (Hanuman Temple) లో తానే స్వయంగా ఈ ప్రక్రియను ప్రారంభిస్తానని తెలిపారు.