BJP CM: ఢిల్లీలో బీజేపీ సీఎం ప్రమాణస్వీకారానికి జోరుగా ఏర్పాట్లు…

రెండు దశాబ్దాల కలను సాకారం చేస్తూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ.. ఇప్పుడు ప్రమాణస్వీకారంపై దృష్టి సారించింది. గురువారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో అంగరంగ వైభవంగా సీఎం, మంత్రులు ప్రమాణం చేయనున్నారు.ఈ ప్రమాణస్వీకారానికి ముందు ప్రముఖ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనుంది. 50 మంది సినీతారలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు ఇతర దేశాల దౌత్యవేత్తలు, 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలు ఈ మెగా ఈవెంట్‌కు రానున్నారు.
ఫిబ్రవరి 20 సాయంత్రం 4.30 గంటలకు కొత్త సీఎం ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు చేసింది కమలదళం. సీఎం అభ్యర్ధిని.. రేపు జరిగే శాసనసభాపక్షం సమావేశంలో ఎన్నుకుంటారని సమాచారం. అయితే రేసులో అందరికన్నా ముందు మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ(parvesh varma) ఉన్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌పై విజయం సాధించారు పర్వేశ్ వర్మ.
అయితే ఇప్పటికే పర్వేశ్ వర్మకు సీఎం అభ్యర్థిగా ఎన్నుకునేందుకుబీజేపీ హైకమాండ్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు 15 మంది మంత్రుల జాబితాలో ఉండే వ్యక్తుల పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. సీఎంకు తోడు ఇద్దరు డిప్యూటీ సీఎంలును నియమించే అవకాశముంది. మొత్తంగా సీఎం, డిప్యూటీ సీఎంలు, మంత్రులు .. సెప్టెంబర్ 20న ప్రమాణం చేసే అవకాశమున్నట్లు సమాచారం.
ఎన్నికల ఫలితాలు వెలువడి 10 రోజులు అవుతున్నా నూతన ముఖ్యమంత్రి (Delhi New CM) ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు బీజేపీ. ఈ పరిణామంపై ఆపద్దర్మ సీఎం అతిశీ విమర్శలు ఎక్కుపెట్టారు. మొత్తంగా గెల్చిన 48 మంది ఎమ్మెల్యేలపై మోడీకి నమ్మకం లేదని అందుకే… ఇప్పటివరకూ ఎవరినీ ఎన్నుకోలేదన్నారు అతిశీ. ఢిల్లీ బీజేపీలో పరిపాలించగల సమర్థులు లేరన్నది మోడి అభిప్రాయంగా ఉందన్నారు అతిశీ.