2020 నుంచి మా వైఖరి అదే : ఆర్మీ చీఫ్

2020 కంటే ముందున్న పరిస్థితి ఏర్పడితేనే బలగాలను వెనక్కి రప్పిస్తామని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. ఏప్రిల్ 2020 ముందునాటి యథాతథ స్థితికి తిరిగి వెళ్లాలని అనుకుంటున్నా. ఆ తర్వాతే బలగాల ఉపసంహరణ, ఎల్‌ఏసీ వద్ద సాధారణ నిర్వహణను పరిశీలిస్తాం. 2020 నుంచి మా వైఖరి అదే. చైనాతో సరిహద్దుల్లో విశ్వసనీయతను పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. బఫర్‌జోన్‌లోకి ప్రవేశించబోమని ఒకరికొకరం భరోసా ఇచ్చుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది అని పేర్కొన్నారు. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ ఇరుదేశాలు కీలక గస్తీ ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఆయన స్పందించారు.