India: భారత్-పాక్ ఉద్రికత్తల వేళ .. కీలక పరిణామం

ఉగ్రవాదులు, వారికి మద్దతు పలికే వారికి భారత్ (India) తాజాగా స్ట్రాంగ్ వార్నింగ్ (Strong warning) ఇచ్చింది. దేశంలో ఇక నుంచి ఎటువంటి ఉగ్రదాడులు (Terrorist attacks) జరిగినా యుద్ధ చర్య గానే పరిగణిస్తామని స్పష్టం చేసింది. అందుకు తగు విధంగా స్పందిస్తామని భారత ప్రభుత్వం (Government of India) నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిరచాయి. భారత్-పాక్ (India-Pakistan) ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.