Chandrababu ఎన్డీయే నేతల సమావేశం.. పాల్గొన్న సీఎం చంద్రబాబు

దివంగత నేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ శత జయంతి నేపథ్యంలో ఎన్డీయే (NDA) నేతలు ఢల్లీిలో భేటీ అయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) నివాసంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) తో పాటు పలువురు ఎన్డీయే మిత్రపక్షాలకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశానికి సంబంధించిన అజెండాను అధికారికంగా ప్రకటించినప్పటికీ, సుపరిపాలన, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.