Amit Shah: నరేంద్రమోదీకి మాత్రమే అది సాధ్యం : అమిత్ షా

ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి కేంద్రహోంమంత్రి అమిత్ షా (Amit Shah) కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబయి (Mumbai) లో జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడారు. మన తల్లులు, సోదరీమణుల నుదుటిపై ఉండే ఆ సిందూర రేఖ ఎంత ముఖ్యమో ప్రపంచానికి చాటిచెప్పామని వ్యాఖ్యానించారు. సిందూరం ప్రాముఖ్యత ప్రపంచానికి తెలిసింది. పాకిస్థాన్ (Pakistan) లోని ఉగ్రస్థావరాలపై దాడులు నిర్వహించి, దేశం గర్వపడేలా చేశాం. నరేంద్ర మోదీ (Narendra Modi)కి మాత్రమే అది సాధ్యం. మన దేశంలో శాంతిభద్రతలకు భంగం కలిగించాలనుకున్నవారిని వెనక్కి పంపేశాం. వారిప్పుడు బాధతో మూలుగుతున్నారు అని అన్నారు.