Siddaramaiah : కాల్పుల విరమణ కు ముందే కేంద్రం అలా చేసి ఉండాల్సింది

కాల్పుల విరమణపై పాక్ (Pak)తో అవగాహనకు రావడానికి ముందే కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీ (All-party meeting), పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపర్చి ఉండాల్సిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదులపై చేపట్టిన సైనిక కార్యకలాపాల క్రెడిట్ అంతా కేవలం సాయుధ దళాలకే చెందుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాల్పులు విరమణ ప్రకటించారు. ఈ విషయంలో ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. రెండు దేశాలకు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (Director General of Military Operations) సమావేశం కొనసాగుతోంది. ఏం నిర్ణయిస్తారో చూద్దాం అని ఓప్రశ్నకు సమాధానంగా చెప్పారు.