విమాన ప్రయాణికులకు షాక్… జూన్ 1 నుంచి

దేశీయ విమాన ప్రయాణం మరింత ఖరీదు కానున్నది. చార్జీల దిగువ పరిమితిని కేంద్ర ప్రభుత్వం 13 నుంచి 16 శాతం పెంచింది. ఎగువ పరిమితిని పెంచలేదు. కరోనాకు ముందు నడిపిన విమానాల సంఖ్యలో సగం మాత్రమే జూన్ 1 నుంచి నడుపాలని విమానయాన సంస్థలను ఆదేశించింది. ప్రస్తుతం 80 శాతం వరకు నడిపేందుకు అనుమతి ఉంది. మరోవైపు, కరోనా కారణంగా షెడ్యూల్డ్ అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలపై విధించిన సస్పెన్షన్‍ను జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు డీజీసీఏ తెలిపింది.