ఎయిర్ ఇండియా కీలక ప్రకటన.. టికెట్లు రద్దైన వారికి

కరోనా సెకండ్ వేవ్‍తో అంతర్జాతీయ ప్రయాణాలపై అనిశ్చితి నెలకొన్న వేళ చాలా మంది ప్రయాణాలు రద్దు చేసుకొన్నారు. టికెట్లు వృథా అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. తన విమానాల్లో టికెట్లు బుక్ చేసుకొని ప్రయాణాలు వాయిదా పడిన వారికి పలు వెసులుబాట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. రిఫండ్ గడువు పెంచున్నట్టు తెలిపింది. ప్రయాణం చేయాలనుకొంటే టికెట్ గడువు కూడా పెంచుతామని, ప్రయాణం రూట్ మార్చుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తామని చెప్పింది. మార్చి 15-31 మధ్య విమానాలు రద్దు కావడం వల్ల, వీసా నిబంధనల వల్ల గమ్యానికి చేరుకోలేకపోయినవారికి ఈ వెసులు బాట్లు వర్తిస్తాయన్నది. యూఏఈ, యూకే, సింగపూర్ లాంటి దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు తొలగించి షరతులతో ప్రయాణికులను అనుమతిస్తున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఈ ప్రకటన చేసింది.