Air India: ఎయిర్ ఇండియా ప్రకటన.. రక్షణశాఖ ఉద్యోగులకు

విమాన ప్రయాణం కోసం టికెట్లు బుక్ చేసుకున్న రక్షణశాఖ (Defense) కు చెందిన ఉద్యోగులకు ఎయిర్ ఇండియా (Air India) , ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) డబ్బులు రిఫండ్ ఇవ్వనున్నది. మే 31వ తేదీ వరకు టికెట్లు (tickets) బుక్ చేసుకుని, ప్రయాణం రద్దు చేసుకున్న రక్షణ సిబ్బందికి డబ్బులు వాపస్ ఇవ్వనున్నట్లు ఎయిర్ ఇండియా గ్రూపు ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ (Operation Sindhur) నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాల దృష్టా రక్షణశాఖ తమ సిబ్బందికి చెందిన సెలవులను రద్దు చేసింది. టికెట్ రద్దు చేసుకున్న వారికి పూర్తి స్థాయిలో రిఫండ్ ఇవ్వనున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.