Blackbox: బ్లాక్‌బాక్స్ నుంచి డేటా డౌన్‌లోడ్ చేసిన ఏఏఐబీ

అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న దిగ్భ్రాంతికర విమాన ప్రమాద ఘటన పై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టింగ్ బ్యూరో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదానికి గురైన విమానం బ్లాక్‌బాక్స్ (Blackbox)ల నుంచి డేటా (Data) విశ్లేషణకు మార్గం సుగమమైంది. ఇందులోని డేటాను ఏఏఐబీ ల్యాబ్ (AAIB Lab) విజయవంతంగా డౌన్‌లోడ్ చేసింది. ఈ విషయాన్ని పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడిరచింది. విమాన ప్రమాదం తర్వాత ఘటనపై దర్యాప్తునకు జూన్ 13న ఏఏఐబీ బృందాన్ని ఏర్పాటు చేసింది. దీనికి ఏఏఐబీ డీజీ నేతృత్వం వహిస్తున్నారు. అదే రోజున ఘటనాస్థలంలోని రూఫ్‌టాప్ (Rooftop) పై కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లు, ఫ్లైట్ డేటా రికార్డర్లను గుర్తించాం. ఆ తర్వాత విమాన బ్లాక్‌బాక్సులను కూడా స్వాధీనం చేసుకుని అత్యంత భద్రత నడుమ ఢిల్లీ (Delhi) కి తరలించాం. జూన్ 24 నుంచి వీటిల్లోని డేటాను బయటకు తీసే ప్రక్రియను సాంకేతిక బృందం ప్రారంభించింది.