Handloom :ఏపీ-తమిళనాడు మధ్య ఒప్పందం

చేనేత వస్త్రాల విక్రయానికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెందిన ఆప్కో, కో ఆప్టెక్స్ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది రూ.9.20 కోట్ల మేర వస్త్రాలు విక్రయాలు చేయాలని ఆప్కో, కో ఆప్టెక్స్ నిర్ణయించాయి. ఈ మేరకు విజయవాడలోని బయ్యర్, సెల్లార్ మీట్‌లో రెండు రాష్ట్రాల చేనేత, జౌళి శాఖల మంత్రులు ఎస్. సవిత(S. Savita), ఆర్. గాంధీ(R. Gandhi) సమయంలో రెండు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. రాష్ట్రంలోని చేనేత వస్త్రాలకు మార్కెట్ విస్తరణలో భాగంగా తమిళనాడు (Tamil Nadu )కు చెందిన కో ఆప్టెక్స్‌తో ఆప్కో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంతో తమిళనాడుకు చెందిన చేనేత వస్త్రాలను ఆప్కో సహా ఇతర వ్యాపార సంస్థల్లో విక్రయిస్తారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh )కి చెందిన చేనేత వస్త్రాలను కో ఆప్టెక్స్ షోరూమ్‌లతో పాటు తమిళనాడు వ్యాప్తంగా ఉన్న పలు వస్త్ర దుకాణాల్లో విక్రయించనున్నారు. త్వరలో మిగిలిన రాష్ట్రాలకు చెందిన చేనేత సంస్థలతోనూ ఒప్పందం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.