బిర్లా ఫ్యాషన్ బోర్డులోకి వారసులొచ్చారు
ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ (ఏబీఎఫ్ఆర్ఎల్) డైరెక్టర్ల బోర్డు లోకి చైర్మన్ కుమార మంగళం బిర్లా పిల్లలు అనన్యశ్రీ బిర్లా, ఆర్యమన్ బిర్లా చేరారు. బోర్డులో వీరు అదనపు నాన్`ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా వ్యవహరించనున్నారు. కంపెనీ నామినేషన్, రెమ్యూనరేషన్ కమిటీ సిఫారసుల ఆధారంగా బోర్డు ఈ నియామకాలను ఆమోదించిందని కంపెనీ ఎక్స్చేంజీలకు ఇచ్చిన సమచారంలో పేర్కొంది. ఈ నియామకాలకు వాటాదార్ల ఆమోదం లభించాల్సి ఉంది. అనన్య ఏర్పాటు మొదటి కంపనీ స్వతంత్ర మైక్రోఫిన్, భారత్లో వేగంగా ఎదుగుతున్న సూక్ష్య రుణ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ఆర్యమన్కు ఎంటర్ప్రెన్యూర్షిప్, వీసీ పెట్టుబడులు, క్రీడల్లో అనుభవం ఉంది.






