Pakistan : పాక్ జాతీయులకు ఊరట.. గడువు పొడిగించిన కేంద్రం!

పహల్గాం ఉగ్ర దాడితో భారత్(India ) -పాక్ సంబంధాల్లో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. ఈ క్రమంలోనే పాక్ జాతీయులు (Pakistani nationals) మన దేశం వీడి వెళ్లేందుకు గడువు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఉత్తర్వుల్లో తాజాగా సవరించినట్లు తెలుస్తోంది. పాక్ జాతీయులు తిరిగి వెళ్లడానికి ఇచ్చిన గడువు మంగళవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 30న వాఘా అటారీ (Wagah Atari) సరిహద్దును మూసివేస్తామని గతంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ (Union Home Ministry) ఇచ్చిన ఉత్తర్వును తాజాగా సవరించినట్లు సమాచారం. ఆంక్షలు సడలడంతో తదుపరి ఆదేశాలు వెలవడేవరకు వారు ఆ సరిహద్దు నుంచి పాక్ వెళ్లేందుకు వెసులుబాటు కలిగింది.