విమాన ప్రయాణీకులకు ఆఫర్… 50 లక్షల టికెట్లు ఫ్రీ
ప్రముఖ ఎయిర్‌లైన్ ఎయిర్ ఏసియా విమాన ప్రయాణికులకు భారీ ఆఫర్ ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ రూట్లలో ఏకంగా 50 లక్షల ఉచిత విమాన టికెట్లను అందిస్తోంది. ఈ మేరకు కంపెనీ ట్విటర్లో వివరాలను అందించింది. కస్టమర్లు సెప్టెంర్ 25 వరకు ఈ ఆపర్లతో టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. ఇలా కొన్ని టికెట్ల ద్వారా జనవరి 1 అక్టోబర్ 28, 2023 మధ్య ప్రయాణించవచ్చని ఎయిర్ ఏసియా గ్రూప్ చీప్ కమిర్షియల్ ఆఫీసర్ కరెన్ చాన్. తమ వెబ్సైట్, మొబైల్ఆప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. యాప్ లేదా వెబ్సైట్లో, ఈ ఆఫర్ యాక్సెస్ కోసం Flights చిహ్యాన్ని ఎంచుకోవాలని తెలిపారు. అంతర్జాతీయంగా విమాన సేవలు క్రమంగా పున ప్రారంభించడంతో పాటు, సంస్థ 21వ పుట్టిన రోజు, సందర్భంగా అందిస్తున్న ఈ బిగ్ సేల్‌ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని చాన్ కోరారు. థాయ్‌లాండ్, కంబోడియా, వియత్నాంతో సహా అనేక ASEAN దేశాల ప్రయాణికులు ఆఫర్‌కు అర్హులు. రెండు నెలల క్రితం ఎయిర్ఏషియా కస్టమర్లకు ఉచిత టికెట్లను అందించిన సంగతి తెలిసిందే.






