మళ్లీ 30 విమానాలకు బాంబు బెదిరింపులు!

విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. ఇటీవల వరుసగా విమానాల్లో బాంబు ఉందంటూ ఫోన్లు, సోషల్ మీడియా పోస్టుల్లో పేర్కొనడంతో సర్వరతా ఆందోళన వ్యక్తమవుతున్నది. తాజాగా దేశీయ విమానయాన సంస్థలు నిర్వహిస్తున్న జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు దాదాపు 30కి పైగా బాంబు బెదిరింపులు వచ్చాయి. సోమవారం రాత్రి నుంచి 30కి పైగా బెదిరింపులు వచ్చాయని అధికార వర్గాలు తెలిపాయి. బెదిరింపుల నేపథ్యంలో జెడ్డాకు వెళ్లాల్సిన మూడు ఇండిగో విమానాలను సౌదీ అరేబియా, ఖతార్ విమానాశ్రయాలకు మళ్లించారు. ఇండిగో, విస్తారా, ఎయిర్ ఇండియా విమానాలకు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.