Pakistan: ఎల్‌వోసీ వెంట పాక్ కాల్పులు .. 15 మంది భారత పౌరులు మృతి

గత కొద్ది రోజులుగా సరిహద్దు నియంత్రణ రేఖ ( ఎల్‌వోసీ) వెంట పాకిస్థాన్ (Pakistan) కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. పహల్గాం (Pahalgam) ఉగ్రదాడికి బదులుగా పాక్ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం మంగళవారం అర్థరాత్రి దాటాక ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో మెరుపు దాడులు చేపట్టింది. దీంతో ఇవాళ కూడా పాక్ రేంజర్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 15 మంది భారత పౌరులు మృతి చెందగా, 43 మంది గాయపడినట్లు భారత ఆర్మీ (Indian Army) వెల్లడిరచింది. పూంఛ్, తంగ్ధర్ సెక్టార్లలో గత రాత్రి నుంచి పాక్ బలగాల కాల్పులు కొనసాగుతున్నాయని పేర్కొంది. సాధారణ నివాస ప్రాంతాలే లక్ష్యంగా పాక్ బలగాల కాల్పులకు పాల్పడుతోంది.