Zelensky : ఇప్పుడా సమయం వచ్చింది .. మనం సిద్ధం కావాలి
యూరోపియన్ యూనియన్ కు సైనిక కూటమిని ఏర్పాటు చేసుకునే సమయం వచ్చిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelensky) అన్నారు. రష్యా తో ఉక్రెయిన్ చేస్తున్న యుద్ధం తమ శక్తిని రుజువు చేస్తోందని పేర్కొన్నారు. ఈయూ సాయుధ దళాలను ఏర్పాటు చేసుకోవడానికి సమయం వచ్చిందని తాను బలంగా నమ్ముతున్నానని తెలిపారు. యుద్ధాన్ని ముగించడానికి రష్యా (Russia ) ముందుకు రావట్లేదని అన్నారు. ఇరుదేశాల మధ్య జరుగుతున్న పోరుకు ముగింపు పలికే ఆలోచన ఆ దేశాన్ని ఉన్నట్లు లేదని అసహనం వ్యక్తం చేశారు. అమెరికా (America) సైనిక సాయం చేయకుండా తమ దేశం మనుగడ సాగించడం అసాధ్యమని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అగ్రదేశం తమకు సైనిక సహాయిన్న ఆపివేసినా ఆశ్చర్యపోనక్కలేదని వ్యాఖ్యానించారు.
ఈ పరిస్థితుల్లో యూరోపియన్ యూనియన్ (European Union) సొంత సైన్యాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సైనికులకు శిక్షణ విన్యాసాల సాకుతో రష్యా తన మిత్రదేశమైన బెలారాస్ (Belarus) కు తన సైన్యాన్ని పంపాలని యోచిస్తున్నట్లు ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపినట్లు జెలెన్ స్కీ పేర్కొన్నారు. పుతిన్ దానిని మరొక రష్యన్ ప్రావిన్సుగా భావిస్తున్నారని అన్నారు. ఈ చర్యలు నాటో దేశాల కూటమికి ప్రత్యక్ష ముప్పును కలిగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.






