శాంతి చర్చలకు రండి… పుతిన్‌కు జెలెన్స్కీ పిలుపు
ఈ ఏడాది నవంబర్‌లో జరిగే శాంతి చర్చలలో పాల్గొనాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పిలుపునిచ్చారు. రెండేళ్లకుపైగా కొనసాగుతున్న యుద్దానికి ముగింపు పలకాల్సిన అవసరాన్ని నొక్కిచెపుతూ, వోలోడిమిర్ జెలెన్స్కీ మాస్కోకు శాంతి సందేశాన్ని పంపారు. నవంబర్‌లో జరగనున్న ఉక్రెయిన్ శాంతి శిఖరాగ్ర సదస్సు రెండవ రౌండ్లో శాశ్వత శాంతి కోసం రష్యాను చేర్చుకోవాలి. జూన్‌లో స్విట్జర్లాండ్‌లో జరిగిన ఉన్నతస్థాయి శిఖరాగ్ర సమావేశాన్ని అనుసరించి, నవంబర్‌లో తదుపరి రౌండ్‌ను నిర్వహించాలని జెలెన్స్కీ యోచిస్తున్నారు. ఈ రౌండ్ కోసం ప్రతినిధుల్ని పంపాలని ఉక్రెయిన్ నాయకుడు పిలుపునిచ్చారు. నాటో సదస్సు కోసం యూఎస్ పర్యటన సంబంధించి మీడియా సమావేశంలో మాట్లాడుతూ రష్యా ప్రతినిధులు రెండవ శిఖరాగ్ర సమావేశంలో ఉంటారని నేను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. రెండో శాంతి శిఖరాగ్ర సమవేశం తేదీని ప్రకటించాల్సి ఉంది. ఉక్రెయిన్‌లో యుద్ధాని ముగించే పరిష్కార మార్గాలపై చర్చించడానికి 90 దేశాల నాయకులు, ఉన్నతాధికారులు స్విట్జర్లాండ్‌లో రెండు రోజుల సదస్సు కోసం సమావేశమయ్యారు.






