Zelensky : రష్యాతో భూభాగ మార్పిడికి మేము సిద్ధం : జెలెన్ స్కీ
రష్యా తో భూభాగ మార్పిడికి తాము సిద్దమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ(Zelensky) పేర్కొన్నారు. అయితే రష్యా(Russia )-ఉక్రెయిన్ భూభాగాలను విడిచిపెడితే తమ అధీనంలో ఉన్న కుర్స్క్ (Kursk) ను వారికి అప్పగిస్తామని షరతు పెట్టారు. వాటిలో ఏ భూభాగాలను తిరిగి తీసుకుంటారని మీడియా అడగ్గా తమ భూభాగాలన్నీ ముఖ్యమైనవే అన్నారు. ఏవి తిరిగి తీసుకోవాలనే విషయంపై చర్చల అనంతరం నిర్ణయం తీసుకుంటామని, అప్పటివరకు చూద్దామని బదులిచ్చారు. తాము అనుకున్నది జరగాలంటే రష్యా-ఉక్రెయిన్(Ukraine) ల మధ్య చర్చలు జరిగేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కృషి చేయాలని కోరారు. 2014లో రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకుంది. అనంతరం డోనెస్క్, ఖేర్సన్, లుహాన్స్క్, జాపోరిజ్జియా ప్రాంతాలను తమ నియంత్రణలోకి తీసుకుంది. అయినప్పటికీ వాటిపై మాస్కోకు పూర్తి నియంత్రణ లేదు.






