Zelensky : అమెరికా మద్దతు లేకుండా మా మనుగడ అసాధ్యం : జెలెన్స్కీ
అమెరికా మద్దతు లేకుండా రష్యా దాడుల నుంచి ఉక్రెయిన్ మనుగడ సాధించడం అసాధ్యమని అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelensky) పేర్కొన్నారు. యుద్ధాన్ని ముగించాలని పుతిన్ (Putin) కోరుకోవడం లేదన్నారు. విరామ సమయంలో మరింత సిద్ధం కావడం, సైనిక బలగాల శిక్షణ, రష్యా (Russia)పై విధించిన కొన్ని ఆంక్షలను ఎత్తివేయించుకోవడం కోసం పలు ఒప్పందాలు చేసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు తెలిపారు. త్వరలో ఐరోపా (Europe)పై రష్యా దాడిచేసే అవకాశం ఉందన్నారు. ఐరోపా ఇప్పటికైనా మేల్కొని సొంతంగా సైన్యాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. రష్యాతో ట్రంప్ జరుపుతున్న చర్చల్లో ఉక్రెయిన్ (Ukraine)భాగస్వామ్యం లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రష్యాతో చర్చలకు ప్రతిఫలంగా ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాలను అమెరికా వినియోగించుకునేందుకు అవకాశమిచ్చే ఏ ఒప్పందంపైనా సంతకం చేయవద్దని జెలెన్స్కీ తమ అధికారుల్ని ఆదేశించారు.






