అమెరికా డ్రోన్ నేలమట్టం!
అమెరికాకు చెందిన ఎంక్యూ-9 డ్రోన్‌ను కూల్చివేసినట్లు యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలను వారు చూపలేదు. మరోవైపు తన దేశానికి చెందిన డ్రోన్లు కూలినట్లు ఎలాంటి సమాచారం లేదని అమెరికా పేర్కొంది. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించినప్పటి నుంచి ఎర్రసముద్రంలోని వాణిజ్యనౌకలపై హూతీలు దాడులకు తెగబడుతున్నారు. దీంతో అంతర్జాతీయ నౌక వ్యాపారం ప్రభావితమవుతోంది. దీంతో హూతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై అమెరికా, దాని మిత్రదేశాలు గత కొంతకాలంగా వైమానిక దాడులను నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగా డ్రోన్లనూ వినియోగిస్తున్నారు. గతంలోనూ ఎంక్యూ `9 రీపర్ డ్రోన్లను హూతీలు కూల్చివేశారు.






