Wipro: విప్రో చేతికి అమెరికా సంస్థ

అమెరికా ఐటీ సేవల కన్సల్టింగ్ సంస్థ అఫ్లైడ్ వాల్యూ టెక్నాలజీస్ (Affiliated Value Technologies) ను 40 మిలియన్ డాలర్ల ( దాదాపు రూ.340 కోట్ల)కు కొనుగోలు చేయనున్నట్లు విప్రో (Wipro) ప్రకటించింది. ప్రస్తుత అప్లికేషన్ సేవల సామర్థ్యాల బలోపేతానికి, కొత్త వృద్ధి అవకాశాలకు ఈ లావాదేవీ దోహదపడనున్నట్లు తెలిపింది. పూర్తి నగదు పద్ధతిలో జరగనున్న ఈ కొనుగోలు ఈ నెల 31కి పూర్తయ్యే అవకాశం ఉందని ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో విప్రో పేర్కొంది. 2021-22 మధ్య పలు అనుబంధ సంస్థలను మసాచుసెట్స్, సింగపూర్, నెదర్లాండ్స్‌లో అఫ్లైడ్ వాల్యూ టెక్నాలజీస్ ఏర్పాటు చేసింది. ఈ కంపెనీలు అంతర్జాతీయంగా ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్, తోడ్పాటు సేవలను అందిస్తున్నాయి.