త్వరలో భారత్కు జెలెన్స్కీ!
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ త్వరలోనే భారత్కు రానున్నట్లు తెలుస్తోంది. పర్యటన తేదీలు ఖరారు కానప్పటికీ, ఈ ఏడాది చివరి నాటికి ఆయన భారత్లో పర్యటించే అవకాశం ఉందని ఉక్రెయిన్ రాయబారి వెల్లడించారు. ఇటీవల ఉక్రెయిన్లో పర్యటించిన ప్రధాని మోదీ భారత్కు రావాలని జెలెన్స్కీని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ ఏడాది చివర్లో ఇక్కడ పర్యటించే అవకావం ఉంది. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో ఇదో ముందడుగు అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపనపై చర్చించేందుకు ఇద్దరు నేతలకు ఇది గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది అని భారత్లోని ఉక్రెయిన్ రాయబారి ఒలెక్సాండర్ పోలిష్చుక్ పేర్కొన్నారు.






