Vladimir Putin :రక్తపాతం ఆగకపోతే పుతిన్దే బాధ్యత
నిన్న మొన్నటివరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పై విరుచుకుపడుతూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇప్పుడు రూటు మార్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin )పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉక్రెయిన్లో శాంతి నెలకొనాలంటే జెలెన్స్కీ (Zelensky) ప్రభుత్వం మారాలని ఇటీవల పుతిన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఉక్రెయిన్ (Ukraine)లో రక్తపాతం ఆగకపోతే, ఆ బాధ్యత పుతిన్దేనని స్పష్టం చేశారు. అప్పుడు తాను రష్యాను ఉపేక్షించనని ఆ దేశంపై భారీ సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఇరాన్ (Iran) పైనా ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అణ్యాయుధాల అంశంపై తమతో చర్చలు జరపడానికి ఆ దేశం ముందుకు రాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో టెహ్రాన్ బాంబుల వర్షం కురిపిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.






