Virat Kohli: కోహ్లీ వచ్చేసాడు.. ఇక పండగే
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) ఫామ్ లోకి రావడం ఏమో కానీ అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు. గత కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న విరాట్ కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ విధంగా రాణిస్తాడు అనేదానిపై పెద్ద చర్చే జరిగింది. ఇక అతను క్రికెట్ నుంచి తప్పుకోవాలని చాలామంది డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇక పాకిస్తాన్ పై కీలక మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేయడంతో అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా విరాట్ కోహ్లీ పేరు మార్మోగిపోతోంది.
ఇక మిగిలిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఏ స్థాయిలో ఆడతాడు అనే దాని పైన ఇప్పుడు అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. సాధారణంగా ఐసీసీ టోర్నీలలో విరాట్ కోహ్లీ ఎప్పుడు సత్తా చాటుతూనే ఉంటాడు. అయితే గత ఏడాది జరిగిన టి20 ప్రపంచ కప్ లో మాత్రం కేవలం ఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక.. మిగిలిన మ్యాచ్ లలో అతను ఏ విధంగా ప్రదర్శన చేస్తాడనే దానిపైనే జట్టు విజయ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. అటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఫామ్ లోకి రావడం కాస్త శుభ పరిణామం అని చెప్పాలి.
మొదటి మ్యాచ్లో 40 పరుగులు చేసిన రోహిత్ శర్మ(Rohith Sharma) రెండో మ్యాచ్లో 20 పరుగులు చేసిన కాస్త దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. ఇక మిగిలిన మ్యాచ్ లలో కూడా రోహిత్ శర్మ ఫామ్ లోకి వస్తే మాత్రం కచ్చితంగా భారత్ కు తిరిగి ఉండదు. న్యూజిలాండ్ తో జరగబోయే లీగ్ మ్యాచ్లో ఏ స్థాయిలో భారత్ ప్రదర్శన చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అటు ఓపెనర్ గిల్ కూడా అంచనాలకు మించి రాణిస్తున్నాడు. ఇక మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఇద్దరు ఫామ్ లోనే ఉన్నారు. దీనితో రాబోయే మ్యాచ్ లలో భారత్ కు ఇబ్బందులు లేవనే చెప్పాలి. ఇక బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే కనపడుతోంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఏ స్థాయిలో ఆడతాడు అనేదానిపైనే అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






