Lalitha Modi: లలిత మోదీకి షాక్
ఐపీఎల్ నిధుల కుంభకోణంలో నిందితుడైన మాజీ చైర్మన్ లలిత్ మోదీ (Lalitha Modi ) కి గట్టి షాక్ తగిలింది. గత 15 ఏళ్లుగా బ్రిటన్ (Britain) లో తలదాచుకుంటున్న ఆయన ఇటీవల పొందిన వనాటు (Vanuatu) పౌరసత్వం రద్దయింది. ఆయన పాస్‌పోర్టును రద్దు చేయాలని ఆ దేశ ప్రధాని జోథం నపాట్ (Jotham Napat) ఆదేశించారు. దీనిపై చర్యలు చేపట్టాలని ఆయన పౌరసత్వ కమిషన్‌కు సూచించారు. భారత పౌరసత్వాన్ని వదులుకుని వనాటులో స్థిరపడాలని భావించిన లలిత్ మోదీ, ఇటీవలే తన పాస్‌పోర్టు (Passport)ను రద్దు చేయాలని లండన్‌లోని భారత హైకమిషన్‌లో దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.






