Saudi Arabia : సౌదీ అరేబియాలో అమెరికా- ఉక్రెయిన్ శాంతి చర్చలు
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని నివారించడానికి వచ్చే వారం సౌదీ అబేరియా (Saudi Arabia )లో అమెరికా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు జరుగుతాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelensky) వెల్లడిరచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం తాను సౌదీ అరేబియాకు వెళ్తానని, తన బృందం అమెరికా అధికారులతో చర్చలు జరపడానికి అక్కడ ఉంటుందని చెప్పారు. వచ్చేవారం అమెరికాతో దౌత్యపరమైన చర్చలు జరగనున్నందున అంతకుముందు సాదీ రాజు మొహమ్మద్ బిన్ సాల్మన్ (Mohammed bin Salman) కలుసుకోవడానికి తాను సౌదీ అరేబియా వెళ్తున్నాని, ఆ తరువాత తమ అధికారుల బృందం అమెరికా భాగస్వాములతో చర్చించడానికి అక్కడ ఉంటుందని చెప్పారు. శాంతి విషయంలో ఉక్రెయిన్ చాలా ఆసక్తిగా ఉందన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కోఫ్ (Steve Witkoff) వచ్చేవారం సౌదీ అరేబియాలో ఉక్రెయిన్‌తో చర్చలు జరపడానికి ప్లాను చేస్తున్నామని తెలిపారు.






