H-1B visa: మార్చి 7 నుంచి హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్లు

అమెరికాలో ఉద్యోగాలు చేయబోయే వాళ్లకు మంజూరు చేసే హెచ్1బీ వీసా (H-1B visa ) లకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ సంవత్సరం మార్చి ఏడో తేదీన మొదలుకానుంది. మార్చి 7 నుంచి 24 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని అమెరికా, పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్) ప్రకటించింది. 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కోట కింద జారీచేసే ఈ వీసాల కోసం ఆయా సంస్థలు (Organizations), ప్రతినిధులు ఆన్‌లైన్ (Online) ద్వారా నమోదు చేసుకోవాలని వెల్లడిరచింది. హెచ్-1బీ వీసా కోసం ఫీజు కింద 215 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.
హెచ్-1బీ వీసాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మోసాలను అరికట్టేందుకు యూఎస్‌సీఐఎస్ (USCIS) ప్రవేశపెట్టిన కేంద్రీకృత ఎంపిక ప్రక్రియ ఈ సంవత్సరం కొనసాగించనున్నారు. దీనిప్రకారం ఒక లబ్ధిదారు బహుళ దరఖాస్తులు చేసుకున్నా వాటి సంఖ్యతో సంబంధం లేకుండా ఒకరికి ఒక దరఖాస్తును మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. మార్చి 24 నాటికి పరిమితిని మించి అప్లికేషన్లు వస్తే ర్యాండమ్(Random) పద్ధతిలో ఎంపిక చేస్తారు. పరిమితికి మించకపోతే వచ్చిన అన్ని రిజిస్ట్రేషన్లను ఆమోదిస్తారు. వీసా లబ్ధిదారుల సమాచారాన్ని సంస్థల యజమానులు మార్చి 7 నుంచి నమోదు చేయడం ప్రారంభించాలి. ఎంపికై వారి వివరాలను మార్చి 31లోగా ఖాతాలకు పంపిస్తారు.
\