America:భారత్‌లో పర్యటించేటప్పుడు జాగ్రత్త .. అమెరికా హెచ్చరిక

భారత్‌లో పర్యటించాలనుకునే తమ పౌరులకు అమెరికా (America) కొత్త అడ్వైజరీ జారీ చేసింది. ఇటీవల కాలంలో అత్యాచారాలు, హింస, ఉగ్రవాదం పెరిగిపోతున్నాయని, భారత్‌కు వెళ్లాలనుకునేవారు జాగ్రత్తగా ఉండాలని ఆ దేశ ప్రభుత్వం సూచించింది. మహిళలు ఒంటరిగా ప్రయాణించొద్దని హెచ్చరిస్తూ అమెరికా విదేశాంగ శాఖ లెవల్ 2 సలహా జారీ చేసింది. జూన్ 16న జారీ చేసిన ఈ అడ్వైజరీలో భారత్‌లో మరింత జాగ్రత్తగా ఉండండి. కొన్ని ప్రాంతాల్లో నేరాలు, ఉగ్రవాదం పెరిగాయి. అక్కడ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేరాలలో అత్యాచారం ఒకటి. పర్యాటక ప్రాంతాలు, ఇతర ప్రదేశాల్లో లైంగిక వేధింపులతో సహా హింసాత్మక నేరాలు జరుగుతాయి. పర్యాటక ప్రదేశాలు (Tourist places), రవాణా కేంద్రాలు, మార్కెట్లు/ షాపింగ్ మాల్స్ (Shopping malls) లో ఎప్పుడైనా ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉంది అని హెచ్చరించింది.
పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన రెండు నెలల తర్వాత అమెరికా ఈ కొత్త అడ్వైజరీ విడుదల చేసింది. ఉగ్రవాదం, అశాంతి నెలకొన్న కారణంగా జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లో ప్రయాణించవద్దు. తూర్పు లద్దాఖ్ , రాజధాని లేప్‌ా తప్ప పర్యాటన ప్రదేశాలైన శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గాం వంటి ప్రాంతాలకు వెళ్లొద్దు. భారత్-పాకిస్థాన్ నియంత్రణ రేఖ వెంబడి హింస, సర్వసాధారణం. భారత్-పాక్ మధ్య సాయుధ ఘర్షణలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని ప్రాంతాలకు ప్రయాణించవద్దు అని విదేశాంగ శాఖ పేర్కొంది. ఇక తుర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు మావోయిస్టు గ్రూపులు చురుకుగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే పౌరులకు అత్యవసర సేవలను అదించే సామర్థం అమెరికా ప్రభుత్వానికి లేదు. ఆయా ప్రాంతాలకు వెళ్లకుండా ఉంటే మంచిది అని సూచించింది. భారత్‌కు వెళ్లాలనుకునేవారు శాటిలైట్ ఫోన్ తీసుకెళ్లొద్దని సలహా ఇచ్చింది.