C.R. Patil: కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో మంత్రి లోకేశ్ భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఢల్లీి పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ (C.R. Patil) ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో 15 నెలలుగా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయనకు వివరించారు. పాటిల్ పోటీ చేసిన తొలి ఎన్నిక నుంచి వరుసగా నాలుగుసార్లు మెజార్టీ పెంచుకుంటూ వెళ్తుండటంపై లోకేశ్ ఆయన్ను అభినందించారు. ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన చర్చలో ఇంతగా ప్రజల అభిమానాన్ని చూరగొనడం వెనుకున్న విజయ రహస్యమేంటని లోకేశ్ అడినట్లు తెలిసింది. దీనికి పాటిల్ స్పందిస్తూ.. నిరంతరం ప్రజలతో మమేకమవుతు, వారితో ఉండటమేనని తెలిపారు. తన నియోజకవర్గం (Constituency) లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలనూ లోకేశ్‌తో పంచుకున్నట్లు తెలిసింది.