Dussehra: దసరా ఉత్సవాల్లో పాల్గొనాలని సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరిగే దసరా(Dussehra) మహోత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని దేవస్థానం ఉన్నతాధికారులు, అర్చకులు ఆహ్వానించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుకు వారు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి, ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో దుర్గ గుడి ఈవో శీనా నాయక్ (Sheena Nayak) , దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ (Ramachandramohan) తోపాటు అర్చకులు పాల్గొన్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఈ నెల 29న అమ్మవారికి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇవి అక్టోబర్ 2వ తేదీతో ముగియనున్నాయి.