Ravi Teja: “లిటిల్ హార్ట్స్” సినిమాకు సెలబ్రిటీల ప్రశంసల వెల్లువ

మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన “లిటిల్ హార్ట్స్” (Little Hearts) సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణతో పాటు సెలబ్రిటీల ప్రశంసలు లభిస్తున్నాయి. విజయ్ దేవరకొండ, నాని, నాగవంశీ, సాయి రాజేశ్, టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ అభిషాన్ జీవింత్ వంటి సెలబ్రిటీలు ఈ చిత్రాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. తాజాగా మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) “లిటిల్ హార్ట్స్” సినిమా బాగుందంటూ ట్వీట్ చేశారు. ‘హార్ట్, హ్యూమర్, హానెస్ట్ పర్ ఫార్మెన్సెస్.. అన్నీ ది బెస్ట్ అనేలా ఉన్నాయి. మూవీ టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు..’ అంటూ విశెస్ అందించారు.
“లిటిల్ హార్ట్స్” చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను అద్భుతంగా ప్రమోట్ చేసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ బన్నీ వాస్ తన బీవీ వర్క్స్, వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేట్రికల్ గా రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రేక్షకాదరణతో 4 రోజుల్లో 15.41 కోట్ల రూపాయల వసూళ్లు దక్కించుకుంది.
https://x.com/raviteja_offl/status/1965384901114691809?s=48