Zelensky అమెరికా ఇచ్చింది 100 బిలియన్ డాలర్లే.. 500 కాదు : జెలెన్స్కీ
రష్యాపై యుద్ధం చేసేందుకు తమకు అమెరికా (America) అందించిన సాయం 100 బిలియన్ డాలర్లే అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelensky) వెల్లడిరచారు. ఇటీవల ట్రంప్ (Trump) చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఈ విషయాన్ని వెల్డడిరచారు. ఈ యుద్ధంలో ఆయుధాల కోసం ఇప్పటి వరకు 320 బిలియన్ డాలర్లు ఖర్చుకాగా, ఇందులో 120 బిలియన్ల డాలర్లను ప్రజల నుంచి సేకరించామని, మరో 200 బిలియన్ డాలర్లను ఐరోపా సమాఖ్య (European Union), అమెరికా అందించాయని జెలెన్స్కీ కీవ్ (Kiev)లో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడిరచారు.






