Iran :ఇరాన్ పై అమెరికా ఆంక్షలు.. భారత్‌పై ప్రభావమెంత?
ఇరాన్ నుంచి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చమురు సరఫరా కాకుండా అడ్డుకునేందుకు అమెరికా చర్యలు చేపట్టింది. షాడో ట్యాంకర్లు (Shadow tankers), వాటి ఆపరేటర్లు, మేనేజర్లను లక్ష్యంగా చేసుకుని తాజాగా ఆంక్షలు విధించింది. ఈ విషయాన్ని అగ్ర రాజ్య విదేశాంగ శాఖ ప్రకటించింది. వివిధ దేశాలకు చెందిన 30 మంది వ్యక్తుల పేర్లు, ట్యాంకర్లు ఆంక్షలు జాబితాలో ఉన్నాయి. భారత్ (India)కు చెందిన బీఎస్ఎం మారిటైమ్ లిమిటెడ్ (BSM Maritime Limited ) లయబిలిటీ పార్టనర్షిప్, ఆస్టిన్‌షిప్ మేనేజ్మెంట్ ప్రైవేటు లిమిటెడ్, కాస్మోస్ లైన్స్ ఐఎన్‌సీ సంస్థలు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు ఫ్లక్స్ మారిటైమ్ ఎల్ఎల్పీ సంస్థ ఓ నౌకను టెక్నికల్ మేనేజర్‌గా పని చేసింది. ఆ ఓడ లక్షల టన్నుల ఇరాన్ ముడి చమురును రవాణా చేసిందని అమెరికా పేర్కొంది.






