Green card : గ్రీన్‌కార్డుకు రెడ్ సిగ్నల్ … కార్పొరేట్ రంగంపై పెనుప్రభావం

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సర్కారు వచ్చిన తర్వాత గ్రీన్‌కార్డు (Green card ) లు, వీసా (Visa)ల జారీ వలసపోవడం కష్టతరంగా మారాయి. అయితే వీటిల్లో వీసాలు, గ్రీన్‌కార్డుల జారీలో జాప్యం వల్ల ఇప్పుడు ఆ దేశ కార్పొరేట్ రంగం (Corporate sector) పై దుష్ప్రచారం చూపడం మొదలుపెట్టింది. వివిధ రంగాల్లోని కార్పొరేట్ లీడర్లు (Corporate leaders) , సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల వర్క్ పర్మిట్‌లు ముగియడం, వాటి పునరుద్ధరణ వెంటనే జరగకపోవడంతో వారు పదవుల నుంచి వైదొలగాల్సి వస్తోంది. ముఖ్యంగా శాశ్వత నివాసం కల్పించే గ్రీన్‌కార్డ్‌ల జారీలో జాప్యం వల్ల సక్రమమార్గంలో దేశంలోకి వచ్చి కొన్నేళ్లుగా వివిధ కంపెనీల్లో పని చేస్తున్నారు కూడా వెళ్లిపోయేటట్లు చేస్తోంది.