ఐరాస సమమావేశాల కోసం న్యూయార్క్‌కు.. దేశాధినేతలు
వివిధ దేశాల మధ్య ఘర్షణలు పెరుగుతున్న వేళ ఐక్యరాజ్యసమితి వార్షిక సర్వ ప్రతినిధి సభ సమావేశాలకు న్యూయార్క్ సిద్ధమైంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, సహా పలువురు నేతలు దీనిలో పాల్గొంటారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆవిర్భవించిన అంతర్జాతీయ సంస్థల్ని ప్రస్తుత సమస్యలకు అనుగుణంగా ఆధునికీకరించడంపై దీనిలో చర్చిస్తారు. అదివారం మొదలైన సమావేశాలు సోమవారం ముగియనున్నాయి. ఆ తర్వాత ప్రపంచ దేశాల నేతల ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. భవిష్యత్తుకు ఒప్పందం పేరుతో రూపొందించిన 42 పేజీల పత్రాన్ని సర్వ ప్రతినిధి సభ 143-7 ఓట్ల తేడాతో ఆమోదించింది.






