Neelam Shinde : భారత విద్యార్థిని కుటుంబానికి అమెరికా వీసా
అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురై కోమాలో ఉన్న భారతీయ విద్యార్థి నీలమ్ షిండే (Neelam Shinde) తల్లిదండ్రులకు వీసా(Visa) మంజూరైంది. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన బిడ్డను చూడటానికి అత్యవసర వీసా మంజూరు చేయాలంటూ ఆమె తల్లిదండ్రులు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన అమెరికా (America) వారికి ఇంటర్వ్యూ చేసింది. ముంబై (Mumbai)లోని యూఎస్ కాన్సులేట్ (US Consulate )కు ఇంటర్వూకు రావాలని కోరింది. అధికారుల సూచనల మేరకు నీలమ్ తల్లిదండ్రులు ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి అత్యవసర వీసా (Emergency visa ) ను యూఎస్ రాయబార కార్యాలయం అధికారులు మంజూరు చేశారు.






