China : చైనాకు అమెరికా కోర్టు జరిమానా
కోవిడ్ మహమ్మారిని కప్పిపుచ్చడంతో పాటు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్(పీపీఈ)పై గుత్తాధిపత్యం చెలాయించిందనే ఆరోపణలపై అమెరికా కోర్టు(American court) చైనా (China)కు 24 బిలియన్ డాలర్ల జరిమానా విధించింది. కొవిడ్ వ్యాప్తికి చైనా ప్రభుత్వమే కారణమంటూ 2020లో మిస్సోరి (Missouri) లో కేసు నమోదైంది. మహమ్మారికి కేంద్రంగా భావిస్తున్న వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, తదితర సంస్థలను బాధ్యులుగా ఇందులో పేర్కొన్నారు. అమెరికాకు సరఫరా కావాల్సిన పీపీఈ కిట్ల (PPE kits) ఉత్పత్తి, కొనుగోలు, ఎగుమతి, దిగుమతులను చైనా ప్రభుత్వం అడ్డుకుందని అందులో ఆరోపించారు. విచారణ ముగించిన జడ్జి స్టీపెన్ కోవిడ్ మహమ్మారికి కారణమై నష్టం కలిగించినందుకు చైనా ప్రభుత్వానికి 24 మిలియన్ డాలర్లు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. చైనా చర్యల ఫలితంగా మిస్సోరికి పన్నుల రూపంలో 8 బిలియన్ డాలర్ల నష్టం కలిగిందని, పీపీఈ కిట్ల సరఫరా నిలిచినందుకు గాను మరో 122 మిలియన్ డాలర్ల మేర అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందని ఆయన తీర్పులో పేర్కొన్నారు. కొవిడ్‌కు చైనాను బాధ్యునిగా చేయడంలో ఇది చారిత్రక తీర్పు అని మిస్సోరి అటార్నీ జనరల్ ఆండ్రూ బెయిలీ (Andrew Bailey) పేర్కొన్నారు. మిసోరిలోని చైనా ఆస్తులను స్వాదీనం చేసనుకుని, నష్టాన్ని భర్తీ చేస్తామన్నారు.






