ఐరాసలో వీగిన రష్మా తీర్మానం
అంతరిక్షంలో సామూహిక జన హనన ఆయుధాలను నిషేధించాలంటూ గత నెలలో అమెరికా, జపాన్లు ప్రవేశపెట్టిన తీర్మానం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో వీగిపోయింది. దీనికి ప్రతిగా అంతరిక్షంలో అన్ని రకాల ఆయుధాల మోహరింపును నిషేధించాలని రష్యా తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిపై చర్య సందర్భంగా ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించాలని రష్యా చూస్తోందని అమెరికా, దాని మిత్ర దేశాలు ఆరోపించాయి. రష్యా గత వారమే ఒక ఆయుధాన్ని రోదసిలో ప్రవేశపెట్టిందన్నాయి. రష్యా దీన్ని ఖండిరచింది. రష్యా తీర్మానంపై ఓటింగ్ జరగ్గా రష్యా, చైనా కూటమి నుంచి 7 ఓట్లు అనుకూలంగా, అమెరికా కూటమి నుంచి 7 ఓట్లు ప్రతికూలంగా పడ్డాయి. స్విట్జర్లాండ్ ఓటింగ్లో పాల్గొనలేదు. తీర్మానం నెగ్గడానికి కావలసిన 9 ఓట్లు రాకపోవడంతో అది వీగిపోయింది.






