Norovirus : యూకేను వణికిస్తున్న నోరోవైరస్
యూకేలో నోరో వైరస్(Norovirus) విజృంభిస్తున్నది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతున్నది. గత ఏడాదితో పోల్చితే రోగుల సంఖ్య రెట్టింపు అయ్యిందని గణాంకాలు చెబుతున్నాయి. నోరో వైరస్ రోగుల్లో వాంతులు, విరేచనాలు తలెత్తుతున్నాయి. దీంతో దీనిని వోమ్టింగ్ బగ్ (Vomiting bug )అని కూడా పిలుస్తున్నారు. అమెరికా (America), ఇతర యూరప్ దేశాల(European country )కు కూడా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు భావిస్తున్నారు. కొత్త వేరియంట్ జీఐఐ.17 వేగంగా విస్తరిస్తున్నదని, తక్కువ రోగ నిరోధక ఉన్న వాళ్లు వైరస్‌బారిన పడుతున్నారని బ్రిటిష్ హెల్త్, సేఫ్టీ ఎగ్జిక్యూటివ్ ప్రతినిధి తెలిపారు.






